Swapna gets PhD from OU : ఓయూ నుండి స్వప్న కు పీ హెచ్ డి పట్టా

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి ) జనవరి 28 త్రినేత్రం న్యూస్. సాధించాలన్న సంకల్పం, పట్టుదల ఉంటే ఎన్ని అవరోధాలు ఎదురైన లక్ష్యాన్ని అడ్డుకోలేవు అని డా.స్వప్న నూనె అన్నారు.

అనేక అవరోధాలు, పేదరికం ఎదుర్కొని గ్రామీణ ప్రాంతం నుండి అత్యంత ప్రతిష్టాత్మకమైన వందేళ్ళ ఓయూలో డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్లో సీనియర్ ప్రొఫెసర్ వెంకటయ్య సార్ పర్యవేక్షణలో (ఇంపాక్ట్ మైక్రో ఫైనాన్స్ ఆన్ ఎంపవర్మెట్ ఆఫ్ ది రూరల్ ఉమెన్) అనే అంశంపై పరిశోధన పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుండి పిహెచ్ డి పట్టా పొందింది.

ఈ సందర్భంగా స్వప్న మాట్లాడుతూ .. ఇంటర్ ,డిగ్రీ ,పీజీ అంతా సంక్షేమహాస్టల్లోచదువుకుంటూ ఫీజులు,పుస్తకాలు కొనుక్కోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొనేది వీటి కొరకు ట్యూషన్ లు చెప్పుతూ తన విద్యాభ్యాసం కొనసాగించిందనీ తెలిపారు.

మహిళల అభివృద్ధియే దేశ అభివృద్ధి. నా పరిశోధనకు సహకరించిన మా అమ్మ నాన్నలకు మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Swapna gets PhD from OU

You cannot copy content of this page

Scroll to Top