తీదేడు గ్రామంలో ప్రభుత్వ భూమిని కబ్జా కాకుండా చూడాలి
గ్రామ నర్సరి మరియు గ్రామ అవసరాల కోసం ఇట్టిభూమినికేటాయించాలి
ప్రభుత్వ భూమి కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి..
ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి
తీదేడు గ్రామ సర్పంచ్
చింత పల్లి జనవరి 28 త్రినేత్రం న్యూస్. తీదేడు గ్రామంలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్నశేఖర్రెడ్డిఅన్నారు. చింతపల్లి మండలం తీదేడు గ్రామంలోని ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా చూడాలని తహాశీల్దార్ కి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… గ్రామంలోని ప్రభుత్వ భూమి గ్రామ నర్సరీ మరియు గ్రామ అవసరాల కోసం కేటాయించాలని అన్నారు.తీదేడు సర్వే నెంబర్ 3/61/ఆ లో 20 గుంటల భూమి నాకు ఉందని 24 సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీ తరుఫున వేసిన బోరు మరియు పైపులైను చుట్టూ కడీలు నాటి భూమిని ఇప్పుడు కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రభుత్వ భోరు ఉన్న భూమి నాదని కబ్జా చేయడం సమంజసంకాదన్నారు.
అడ్డదారిలో ప్రభుత్వ భూమిని పోజిషన్ సర్టిఫికెట్ లేకున్నా పాసు పుస్తకంసంపాదించుకొని ప్రభుత్వం భూమి ఎక్కడ ఖాలిగా ఉంటే అక్కడ కబ్జా చేసుకోని ఇతరులపై దౌర్జన్యానికి పాలు పడుతున్న దాసరి మారయ్య పై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇడబోయిన వెంకటయ్య యాదవ్, వార్డు సభ్యులు మాదగోని కృష్ణ గౌడ్,బొడ్డు పార్వతమ్మ,గంటెల అలివేలు సోమయ్య,రెడ్డి పద్మ పరమేష్,శివర్ల పర్వతాలు, గ్రామ స్తులుమర్రురామారావు, సోనగంటి గొవర్థనాచారి, మర్రు శ్రీనివాస రావు,కాయితి బచ్చిరెడ్డి,వీరమల్లవెంకటయ్య,వీరమల్ల సత్తయ్య,వీరమల్ల జగదీష్,కాయితిబుచ్చిరెడ్డి,సిమర్ల శ్రీను యాదవ్,మెండె రాములు,తదితరులున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


