త్రినేత్రం న్యూస్ అశ్వారావుపేట.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం.. దమ్మపేట, అశ్వారావుపేట మండలాల లో శాసనసభ్యులు జారే ఆదినారాయణ విస్తృతంగా పర్యటిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ముందుగా గండుగులపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. గ్రామీణ యువతీ, యువకులు, విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం అంకంపాలెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కోటి 60 లక్షల రూపాయల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి అలాగే 80 లక్షల రూపాయలతో ఉపాధ్యాయుల సౌకర్యం కొరకు ప్రత్యేక గదుల నిర్మాణానికి,శంకుస్థాపన చేశారు. గిరిజన విద్యార్థినులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
దమ్మపేట మండల కేంద్రంలో టీపీసీసీ జిల్లా అధ్యక్షురాలు,తోట దేవి ప్రసన్న, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్, దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వాసం రాణి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు మద్దిశెట్టి సత్య ప్రసాద్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కాకా రమేష్, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును బీజేపీ ప్రభుత్వం తొలగించడం అన్యాయమని నిరసిస్తూ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
అనంతరం అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో పేరాయిగూడెం, పేటమాలపల్లి, దొంతికుంట కాలనీల్లో 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్ ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆయన తెలిపారు. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలోని మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళల గౌరవాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా ఉపయోగ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట మండల అధ్యక్షులు తుమ్మా రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకపల్లి వీరభద్రరావు, జూపల్లి రమేష్, మొగళ్లపు చెన్నకేశవరావు, జేష్ఠ సత్యనారాయణ చౌదరి, గంగాధర్ రావు, చిన్నశెట్టి యుగంధర్,ఎర్రా వసంతం, గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


