డిండి( గుండ్ల పల్లి) జనవరి 20 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ను నూతనంగా ఎన్నిక కాబడిన డిండి గ్రామ సర్పంచ్ నల్లగంతుల రవి, ఉప సర్పంచ్ కౌసర్ రషీద్ లను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గీతాంజలి , మరియు ఉపాధ్యాయులు అభినందనలు తెలుపుతూ ఘనంగా సత్కరించడం జరిగింది.
పాఠశాల కావాల్సిన మౌలిక వసతుల గురించి,మధ్యాహ్నం భోజనం,విద్యార్థుల ప్రగతి గురించి, పాఠశాల విద్యార్థుల నుఅడిగితెలుసుకున్నారు. అలాగేపాఠశాలలోవున్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు త్వరలోనే ఆ సమస్యలను పరిష్కరించడానికి తమ వంతు సహాయ సహాకారలు ఉంటాయని హామీ ఇచ్చారు. అనంతరం ఉపాధ్యాయుల బృందం కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఎన్ గీతాంజలి, సీనియర్ ఉపాధ్యాయులు వి తిరుపతయ్య, కె ధనమ్మ, పి సరోజ, యం అనిత, ఎల్ సత్యనారాయణ, ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


