Sankranti Festival Greetings : సంక్రాంతి కొలన్ హన్మంత్ రెడ్డి ని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు

TRINETHRAM NEWS

Trinethram News : సంక్రాంతి పండగ సందర్బంగా” కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానం వ్యక్తం చేశారు.

అనంతరం హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, సంక్రాంతి పండగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త వెలుగులు నింపాలని, రైతులకు మంచి పంటలు, ప్రజలకు ఆరోగ్యం-సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. ప్రజాపాలన ప్రభుత్వంతో కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమానికి నిరంతరం కట్టుబడి ఉందని, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి అందరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ, రానున్న రోజుల్లో మరింత బలంగా ప్రజల పక్షాన నిలబడతామని హామీ ఇచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Constituency Congress party leaders met with Kolan Hanmanth Reddy

You cannot copy content of this page

Scroll to Top