Avoid Sankranti Traffic : సంక్రాంతి ట్రాఫిక్ రద్దీ నివారణకు హైదరాబాద్ వెళ్లే వాహనాలకు దారి మళ్లింపు

TRINETHRAM NEWS

Trinethram News : నల్లగొండ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్

సంక్రాంతి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పండగ పూర్తి చేసుకొని ఒకే సారి హైదరాబాద్ నగరానికి భారీగా వాహనాలు వచ్చే నేపథ్యంలో, నేషనల్ హైవే- 65 (హైద్రాబాద్- విజయవాడ) పై చిట్యాల మరియు పెద్ద కాపర్తి వద్ద ప్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నందున, ట్రాఫిక్ జామ్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నందున ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా మరియు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా, ప్రయాణికులకు సురక్షితమైన మరియు సాఫీ ప్రయాణం కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక ట్రాఫిక్ దారి మళ్లింపు చర్యలు చేపట్టిందని జిల్లా ఎస్పి ఒక ప్రకటనలో తెలిపారు.

దారి మళ్లింపు వివరాలు* :

1) గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు :
గుంటూరు → మిర్యాలగూడ → హాలియా → కొండమల్లేపల్లి → చింతపల్లి – మాల్ మీదుగా హైదరాబాద్.

2) మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు :
మాచర్ల → నాగార్జునసాగర్ → పెద్దవూర → కొండపల్లేపల్లి – చింతపల్లి-మాల్ మీదుగా హైదరాబాద్.

3) నల్లగొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు :

నల్లగొండ – మార్రిగూడ బై పాస్ -మునుగోడు → నారాయణపూర్- చౌటుప్పల్ (ఎన్.హెచ్ 65)మీదుగా హైదరాబాద్.

4.) విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారి వాహనాలు..

కోదాడ-హుజూర్నగర్-మిర్యాలగూడ-హాలియా-చింతపల్లి- మాల్ మీదుగా హైదరాబాద్.

5). ఎన్. హెచ్ 65 (విజయవాడ -హైదరాబాద్ )రహదారి పై చిట్యాల,పెద్దకాపర్తిలో ప్లై ఓవర్ నిర్మాణాలు జరుగుతున్నందున ట్రాఫిక్ జామ్ అయిన పక్షంలో చిట్యాల నుండి భువనగిరి గుండా హైద్రాబాద్ మళ్లించడం జరుగును .

ఈ మార్గాల ద్వారా వెళ్లడం వల్ల ప్రధాన రహదారి విజయవాడ, హైద్రాబాద్ పై (ఎన్. హెచ్ 65 )ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి, ప్రయాణికులు గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవచ్చని పోలీసులు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Hyderabad-bound vehicles diverted to avoid Sankranti traffic congestion

You cannot copy content of this page

Scroll to Top