Trinethram News : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్చార్జి దాట్ల చక్రవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కేక్ కట్ చేసి పంచిపెట్టారు.
నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం టిడిపి కో క్లస్టర్ ఇంచార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ స్నేహానికి మారుపేరు దాట్ల చక్రవర్ధన్ రెడ్డి అని పేర్కొన్నారు. కోటంరెడ్డి సోదరులు అప్పటి అధికార పార్టీని వీడి బయటకు వచ్చిన రోజుల్లో కష్ట కాలంలో దాట్ల చక్రవర్ధన్ రెడ్డి వెంట నడిచారన్నారు.
పార్టీపరంగా ఏ బాధ్యతల అప్పగించిన దానిని నూరు శాతం విజయవంతం చేసిన ఘనత దాట్ల చక్రవర్ధన్ రెడ్డి కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో 37వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్, చెక్క సాయి సునీల్, హజరత్ నాయుడు, లక్ష్మీరెడ్డి, ప్రసాదు, విజయ్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


