Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, GHMC 295 డివిజన్ భౌరంపేట్ లో ఈరోజు జాతీయ యువజన దినోత్సవం….స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వారి విగ్రహానికి డివిజన్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, దేశభక్తిని నింపిన మహానుభావుడని. లేచి నిలబడండి… లక్ష్యాన్ని చేరే వరకు అగకండి అన్న ఆయన సందేశం నేటి యువతకు ఆదర్శం అన్నారు. విద్య అనేది కేవలం పుస్తక జ్ఞానం కాదని వ్యక్తిత్వాన్ని నిర్మించేదని ఆయన బోధించారని అన్నారు.
ఈ కార్యక్రమంలో భౌరంపేట్ PACS చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, నాయకులు మిద్దెల యాదిరెడ్డి, భౌరంపేట్ మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , విష్ణువర్ధన్ రెడ్డి , పీసరి కృష్ణారెడ్డి , D. ప్రభాకర్ రెడ్డి , B. కృష్ణారెడ్డి , K. ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


