వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి భారీ చేరికలు

TRINETHRAM NEWS

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి భారీ చేరికలు

వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం పిచికలపాలెం గ్రామం కు చెందిన అమృతపూడి యోగయ్య, అమృతపూడి పిచ్చయ్య, అమృతపూడి వెంకయ్య వారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో యువ నాయకులు బొల్లా గిరిబాబు సమక్షంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరారు.

పార్టీ లో చేరిన వారికి వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు…

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వినుకొండ నియోజకవర్గం లో మరియు గౌరవ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి అందిస్తున్న సంక్షేమ పథకాల కు, జరుగుతున్న అభివృద్ధి కి ఆకర్షితులై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరామని వారు చెప్పటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. పార్టీ లో చేరిన ప్రతి ఒక్కరూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కుటుంబ సభ్యులే అని, వారికి పార్టీ తరపున సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు…

You cannot copy content of this page

Scroll to Top