ఏపీ ప్రభుత్వం – కీలక ప్రకటన
పేద బ్రాహ్మణుల కోసం ‘గరుడ’ పథకం
Trinethram News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం ‘గరుడ’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. బ్రాహ్మణ కుటుంబంలో మరణం సంభవిస్తే.. సంబంధిత కుటుంబానికి రూ. 10,000/- ఆర్థిక సాయం అందజేయనున్నారు.
ఈ పథకం కష్ట సమయంలో బ్రాహ్మణ కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు రూపకల్పన చేయబడింది. ఇప్పటికే పథకం అమలుకు సంబంధించిన కార్యాచరణ ప్రారంభమైంది.
అమరావతి సచివాలయంలో మంత్రి సవిత గారు – బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చిరాంప్రసాద్ గారితో సమావేశమై .. గరుడ పథకం అమలు విధానంపై చర్చించారు.
అధికారిక మార్గదర్శకాలు విడుదలైన వెంటనే పూర్తి వివరాలు తెలియజేయబడతాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


