అరకులోయ జనవరి 8, (త్రినేత్రంన్యూస్).. మండలంలో బొండం పంచాయతీ రేగ గ్రామంలో బుధవారం అరకువ్యాలీ తహశీల్దార్ కె.కుమార స్వామి ఆధ్వర్యంలోమూడు గ్రామ లైన రేగ,రంపుడువలస,రంగినిగుడ గ్రామంలకు మొత్తం 219 పంపిణీ చేయవలసి ఉండగా , రేగ గ్రామంలో200 మంది రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను పంపిణీ చేశారు.
గత ప్రభుత్వంలో రైతులకు ఇచ్చిన పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకుని, రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు రైతులకు అందిస్తున్నామని తహశీల్దార్ కె.కుమార స్వామి చేతుల మీదుగా లబ్ధిదారులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశామని తెలిపారు.
కార్యక్రమంలో బొండం పెసా ఉపాధ్యక్షులు,పెసా మండల పోరం అధ్యక్షలు మరి కొంతమంది రైతులకు సుంకరి ఆనందరావు చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాలు చేస్తూ ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సేవలో ఎలాంటి లోపాలు లేకుండా చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రస్తుతం రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా పారదర్శకంగా నిర్లక్ష్యం లేకుండా అమలు చేస్తున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బొండం సర్పంచ్.
దురియ భాస్కరరావు పాల్గొనిమాట్లాడుతూ గతంలో మా పంచాయతీలో మూడు గ్రామాలే రీ సర్వే ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని ఆయా గ్రామాల్లో రీ సర్వే చేయించుకున లబ్ధిదారులకు ప్రభుత్వం రాజముద్రత కూడిన నూతన బట్ట పాస్ పుస్తకాల మంజూరు చేస్తున్నారని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో రీ సర్వే డిప్యూటీ తాసిల్దార్, పంచాండి గోవింద్, మండల రెవెన్యూ ఎన్ని ఇన్స్పెక్టర్, పట్టాసి శంకర్ రావు, విఆర్ఓ నందో, సర్వేయర్ సూర్య, బొండం పంచాయతీ ఉప సర్పంచ్ అప్పన, వీఆర్ఏ సంఘం నాయకులు నారజీ అప్పారావు,గొల్లోరి సుబ్బారావు, ఆయా గ్రామ రైతులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


