Village Development : ప్రజా సేవకు , గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాం

TRINETHRAM NEWS

ఖమ్మం ,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : జనవరి : 06 :(త్రినేత్రం న్యూస్); సత్తుపల్లి , అశ్వరావుపేట నియోజకవర్గాలలో ఉన్న మండలాలు సత్తుపల్లి , అన్నపురెడ్డిపల్లి లో గల గ్రామాలు కిష్టాపురం, పెంట్లం భారత రాష్ట్ర సమితి సర్పంచ్ లు తోట చర్ల. భాను ప్రకాష్, కారం. శివ మాట్లాడుతూ వాళ్లకు ఎన్ని ఓట్లు పడ్డాయో, మెజార్టీ ఎంత వచ్చిందో , ఎన్ని వార్డులు ఉన్నాయో, ఎన్ని గెలుసుకున్నారో వివరించి చెప్పారు.

అదేవిధంగా ఆ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. పెంట్లం గ్రామానికి చెందిన సర్పంచ్ మరియు పాలకవర్గం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధ్యక్షులు తో సహా కొన్ని పథకాలు వాళ్ల సొంతంగా ప్రకటించారు. అవి. అన్నయ్య భరోసా, ప్రతి ఆడబిడ్డ పెళ్లికి రూపాయలు ఐదు వందల పదహార్లు , మామయ్య కానుక పుట్టిన ప్రతి ఆడబిడ్డకి మూడు వేల పదహార్లు, కొడుకు బాధ్యత అకాల మరణం చెందిన వాళ్ల కు అంత్యక్రియలకు సంబంధించి ఐదువేలు, పంచాయితీలో పెట్టిన ప్రతి బతుకమ్మకు కానుక రెండు వేల పదహార్లు, పశువు వైద్యశాల, గ్రంధాలయం, ప్రతి నెల మొదటి వారంలో ప్రజా సమస్యలను స్వీకరించి , వాటి పరిష్కారానికి కౌంటర్. యువత క్రీడాకారుల కోసం గ్రౌండ్, గ్రామీణ మూగజీవుల కోసం నీటి తొట్టెలు ఈ విధంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
మా గ్రామ ప్రజలు మమ్మల్ని నమ్మి గెలిపించినందుకు అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పడం జరిగింది. మేము ఉప సర్పంచ్ లు, గ్రామ వార్డులు అందరం కలిసి అభివృద్ధికి, ప్రజాసేవకు ఇష్టంతో పనిచేస్తాము అని సూచించారు. ప్రజలకు ఏదైనా సమస్య వస్తే పరిష్కార దిశగా ముందుంటామని పేర్కొన్నారు.

గ్రామస్థాయి నుండి దేశ స్థాయి వరకు ప్రజలందరకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అడ్వాన్సుగా భోగి, సంక్రాంతి, కనుమ పండగ శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నామని అన్నారు ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలు కలిగి ఉండాలని, వాళ్లు చేసే వృత్తులలో సిరిసంపదలు కలగాలని, మంచి ఆరోగ్యంతో ఉండి ఎటువంటి ఇభేదాలు లేకుండా, రాకుండా నీతి, నిజాయితీ, ధర్మం వైపు నిలబడాలని , మంచి ప్రవర్తన కలిగి ఉండాలని తెలిపారు.

ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు నిరుపేదలకు రావలసినటువంటి ఏవైనా సరే అందరికీ కాకుండా కొందరికి మాత్రమే వచ్చాయని వాళ్ల బాధ వ్యక్తపరిచారు. వందకు వందశాతం నిరుపేదలకు న్యాయం చేయాలని ప్రభుత్వంపై మండిపడ్డారు. దయచేసి వాళ్లకు న్యాయం చేయాలని కోరారు .

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

We will work for public service and village development

You cannot copy content of this page

Scroll to Top