SP Sneha Mehra : రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన మోమిన్‌పేట్ పి‌ఎస్ సైబర్ వారియర్ ను అభినంధించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా

TRINETHRAM NEWS

Trinethram News : సైబర్ నేరాల నియంత్రణలో మరియు బాధితులకు సత్వర న్యాయం అందించడంలో విశేష ప్రతిభ కనబరిచిన మోమిన్‌పేట్ పోలీస్ స్టేషన్ సైబర్ వారియర్ (కానిస్టేబుల్) ఎం.డి. జావిద్‌ పాషా కు రాష్ట్ర స్థాయి పురస్కారం లభించింది.

హైదరాబాద్‌లోని స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ డీజీపీ శివధర్ రెడ్డిమరియు సైబర్ సెక్యూరిటీ అడిషనల్ డీజీ షికా గోయల్ చేతుల మీదుగా జావిద్ పాషా ప్రశంసా పత్రం మరియు నగదు బహుమతిని అందుకున్నారు.

సైబర్ మోసాలకు గురైన బాధితుల నగదును రికవరీ చేయడంలో మరియు కేసుల ఛేదనలో పోలీస్ అధికారులకు సమన్వయం తో, ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ, చురుగ్గా వ్యవహరించిన జావిద్‌ పాషా ను వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ప్రత్యేకంగా అభినందించారు.

జిల్లా పోలీసుల కృషికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావడం పట్ల ఎస్పీ హర్షం వ్యక్తం చేస్తూ, ఇదే స్ఫూర్తితో సైబర్ నేర రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

SP Sneha Mehra congratulated the Mominpet PS Cyber ​​Warrior

You cannot copy content of this page

Scroll to Top