CM & Minister in Mumbai : ముంబై పర్యటనలో సీఎం రేవంత్‌ – ఉత్తమ్‌

TRINETHRAM NEWS

బనకచర్ల కేసు పరిణామాలపై కీలక వ్యూహాలోచన

ముంబై: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేడు ముంబైకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీతో భేటీ కావడం నిర్ణయమైంది. రేపు సుప్రీంకోర్టులో విచారణకు రానున్న బనకచర్ల కేసుపై ఈ భేటీలో వ్యూహాత్మక చర్చలు జరగనున్నాయి.
కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు అనుమతి ఇవ్వకూడదని ఇప్పటికే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు సుప్రీంకోర్టులో తమ వాదనలను బలపరచే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపధ్యంలో సీఎం, మంత్రి, లీగల్‌ టీమ్ మధ్య కీలక చర్చలు జరగనున్నట్లు సమాచారం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CM Revanth Reddy and Minister Uttam Kumar Reddy

You cannot copy content of this page

Scroll to Top