త్రినేత్రం న్యూస్ వరంగల్ జిల్లా ప్రతినిధి.. వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్.బి సాంబశివరావు ఆదేశాల ప్రకారం జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి ఈదురు అనిల్ కుమార్ నేడు (డి.టి.సి.ఓ) జిల్లా క్షయ నియంత్రణ పరీక్షల కేంద్రం వరంగల్ ఎంజీఎం లో జరుగుచున్న కార్యక్రమాలను పరిశీలించి వచ్చిన వ్యాధిగ్రస్తులతో ఈ విధముగా అవగాహన కల్పించినారు. క్షయ వ్యాధి ఒక్క అంటూ వ్యాధి . దీని లక్షణాలు రెండు వారాలకు మించి దగ్గు రావడం, రాత్రిపూట చలి జ్వరం రావడం, ఆకలి లేకపోవడం బరువు తగ్గడం, తెమడలో రక్తం రావడం ,నీరసంగా ఉండడం ,బలహీనంగా ఉంటుంది .
ఈ లక్షణాలు కనిపించిన వెంటనే జిల్లాలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఎంజీఎం సీకేఎం, వర్ధన్నపేట, నర్సంపేట ప్రభుత్వ దావఖానలో వైద్య సిబ్బంది ద్వారా సరియైన పరీక్షలు నిర్ధారణ పరీక్షలు ట్రూ నాట్ టెస్ట్, సి బి నాట్ టెస్టులు చేసి చేయవ్యాధి నిర్ధారణ అయితే ఉచితంగా దానికి సంబంధించిన మందులను ప్రతినెల ఇస్తూ వైద్య సిబ్బంది పర్యవేక్షిస్తారని తెలిపినారు .
వ్యాధిగ్రస్తులు వైద్య సిబ్బంది ఇచ్చే మందులతో పాటు పౌష్టికమైన ఆహారము తీసుకోవడం వలన ఈ వ్యాధి పూర్తిగా నయమవుతుందని తెలిపినారు. వ్యాధిగ్రస్తులకు నిశ్చయ్ పోషణ యోజన కింద వారి ఆరోగ్య అవసరాల పోషణ నిమిత్త బత్యము ప్రభుత్వము ఇస్తుందని తెలిపినారు.
ప్రజలు క్షయవ్యాధిని అంతం చేయడానికి తమ వంతు కృషి చేయాలని లక్షణాలు ఉన్న వెంటనే వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సహాయం పొందాలని, వ్యాధి విస్తరించకుండా దగ్గిన, తుమ్మిన ప్రతిసారి నోటికి రుమాలు లేదా మాస్క్ ధరించాలని కనీసం చేతి పై భాగము మడిచి అడ్డుపెట్టుకోవాలని తెలిపినారు.
సాధ్యమైనంత వరకు గాలి వెలుతురు ఉన్న ప్రదేశాలలో ఉండాలని వరంగల్ జిల్లాను క్షయ రహిత జిల్లాగా మార్చడానికి ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు వైద్య ఆరోగ్యశాఖ సమన్వయముతో పనిచేయాలని తెలిపినారు .
ఈ కార్యక్రమంలో సుభాషిని ఎస్ టి ఎస్ లు రంజిత్, శ్రీధర్ ,ఎస్ టి ఎల్ ఎస్, ధర్మరాజు ఫార్మసిస్ట్, వేణుగోపాల్ లాబ్ టెక్నీషియన్ ,టీబి సూపర్వైజర్ సంకీర్త, మాధవి, నరేష్ , అశోక్ మరియు క్షయ వ్యాధిగ్రస్తులు తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


