విద్యార్థులో స్రృజనాత్మకథ వెలికి తీయాలి
ఎస్ఐ లక్ష్మణ్
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట
విద్యార్థులో స్రృజనాత్మకథ వెలికి తీయాలని ఎస్ఐ లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ లోని ట్రీనిటీ హై స్కూల్లో సైన్స్ ఫెయిర్ కు ముఖ్య అతిథి గా స్థానిక ఎస్ ఐ లక్ష్మన్ హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా ఎస్ఐ లక్ష్మణ్ మాట్లాడుతూ……. తొమ్మిది వందల మంది విద్యార్థిని,విద్యార్థులు ఈ సైన్స్ ఫెయిర్ లో పాల్గొనడం చాలా గొప్ప విషయం అన్నారు. విద్యార్థులు కూడా తమ పరిశోధనల ద్వారా మానవాళి అభివృద్ధికి పాటుపడేలా కష్టపడాలన్నారు. విద్యావకాశాలు, వసతులు ఎలా ఉన్నా గొప్ప స్థాయికి ఎదగాలన్నారు. అత్యంత పేద కుటుంబంలో పుట్టి చాలా కష్టపడి చదువుకుని, మిస్సైల్ మ్యాన్ గా ఎదిగి, ఆ తర్వాత ఈ దేశానికి రాష్ట్రపతి అయిన డాక్టర్ ఏపీజె అబ్దుల్ కలాం మనందరికీ స్పూర్తిదాయకమన్నారు. పట్టణం లో సైన్స్ ఫెయిర్ నిర్వహించడం చాలా గొప్ప విషయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఏవి జోసెఫ్, డైరెక్టర్ డోన్ డొమినిక్,వైస్ ప్రిన్సిపాల్ బ్రో రాహుల్,సతీష్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.