Health Check-ups : కృష్ణ యానాది కాలనీలో ఆరోగ్య పరీక్షలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. పెనుమూరు మండలం రామకృష్ణాపురం పంచాయతీ కృష్ణ యానాది కాలనీలో ఈరోజు మంగళవారం మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపు చిత్తూరు జిల్లా పరిషత్ సీఈవో ఆధ్వర్యంలో జరిగింది.

ఈ క్యాంపులో అందరికీ ఆరోగ్య పరిక్షలు నిర్వహించారు. ముఖ్యంగా మహిళలకు అనీమియా రక్తహీనత మొదలైన లోపాల గురించి తెలియజేశారు. అలాగే ఇంటింటికి వెళ్లి వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కల్పించారు.

ఇంకా ఆరోగ్య శ్రీ కార్డు లేని వారి సమాచారాన్ని మరియు స్కిల్ డెవలప్మెంట్ సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దినేని రుద్రయ్య నాయుడు, చిత్తూరు పార్లమెంటరీ కార్యదర్శి తలారి రెడ్డప్ప,

తాసిల్దారు శ్రావణ్ కుమార్, ఎంపీడీవో నీలకంటేశ్వర్ రెడ్డి, డాక్టర్ హర్షవర్ధన్, డిప్యూటీ ఎంపీడీవో, జి ఎస్ డబ్ల్యూ ఎస్, పంచాయతీ కార్యదర్శి జ్యోతిశ్వర్, సచివాలయ సిబ్బంది మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Health check-ups in Krishna Yanadi Colony

You cannot copy content of this page

Scroll to Top