సిపిఐ జాతీయ సమితి సభ్యులు ఎం డి యూసుఫ్.
Trinethram News : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 101 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు కుత్బుల్లాపూర్ మండలంలోని వివిధ ప్రాంతాలలో సిపిఐ ఫతాకం ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ సమితి సభ్యులు ఎండి యూసుఫ్, జిల్లా కార్యదర్శి ఉమామహేశ్ పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం జరిగిందని భారతదేశ స్వాతంత్రం కోసం ప్రజల్ని సమీకరించి బ్రిటిష్ వారిని ఈ దేశం నుండి తరిమి కొట్టడానికి ప్రముఖ పాత్ర పోషించిందని అదేవిధంగా బ్రిటిష్ వారు వదిలిపెట్టిన సంస్థానాలను భారతదేశంలో విలీనం అయ్యేందుకు తెలంగాణలో సాయుధ పోరాటం నిర్వహించి నిజాం రజాకారులను తరిమి 10 లక్షల ఎకరాలను పంచినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీ ఉన్నదని ఈ దేశంలో సోషలిస్టు వ్యవస్థ ఏర్పాటు చేయడమే సిపిఐ పార్టీ లక్ష్యం అని అన్నారు.
ప్రజలందరికీ ప్రభుత్వమే విద్యను,వైద్యాన్ని, ఉపాధిని కల్పించాలని, దున్నేవానికి భూమి, అన్ని వనరుల పైన ప్రభుత్వనీకె చెందాలని, ప్రజలందరికీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించవచ్చని అలాంటి వ్యవస్థను కోరుకునే ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ మాత్రమేనని అన్నారు.అన్ని రాజకీయ పార్టీలు ప్రజలను కులం మతం గా విడగొట్టి తమ రాజకీయ పబ్బన్ని గడుపుకుంటున్నాయని కావున కమ్యూనిస్టు పార్టీ లక్ష్యాన్ని ప్రజలందరికీ వివరించి కమ్యూనిస్టుల వైపు వచ్చేలా చూడాలని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ప్రజలు పెట్టుబడిదారీ వ్యవస్థను తిరస్కరించి దాని దుష్ఫలితాలను అనుభవించి కమ్యూనిజమే అన్ని సమస్యలకు పరిష్కారం అని భావించి అనేక దేశాలలో కమ్యూనిస్టులకు అధికారమిస్తున్నారని అదే ఒరవడితో భారత దేశంలో కూడా కమ్యూనిజమే ప్రత్యామ్నాయంగా ఏర్పడుతుందని దానికోసం కార్యకర్తలు అంత కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమాలకు మండల కార్యదర్శి కే స్వామి, సహాయ కార్యదర్శులు హరినాథ్ రావు రాములు నాయకత్వం వహించగా సీనియర్ నాయకులు ఏసురత్నం, సి వెంకటేష్,నరసయ్య, దుర్గయ్య ఏఐటియుసి కార్యదర్శి వి శ్రీనివాస్, మహిళా సమైక్య జిల్లా*అధ్యక్షురాలు హైమావతి ప్రజానాట్యమండలి అధ్యక్షుడు ప్రవీణ్, బాబు కోశాధికారి సదానంద్, సిపిఐ శాఖ కార్యదర్శిలు సాయిలు,బక్కరి మల్లేష్, కృష్ణ, నరసయ్య, వీరస్వామి, శ్రీనివాస్ చారి సహదేవరెడ్డి,కే వెంకటేష్, కొండయ్య, నరేంద్ర చారి,
సిపిఐ నాయకులు నరసింహారెడ్డి, రమేష్, భాస్కర్, యూసుఫ్, రామ్ రెడ్డి, సుధాకర్, రామచంద్ర రెడ్డి, నరేష్, ఇమామ్, చంద్రయ్య, నాగే చారి,రాజు, వంశీ, అహ్మద్,శ్రీనివాస్ చారి, మల్లయ్య, చంద్రయ్య తో పాటు కార్యకర్తలు వివిధ శాఖల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గుబురు గుట్ట కార్యకర్త కృష్ణచారి పార్టీకి 800 రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


