Local body elections-Field Bbservation : స్థానిక సంస్థల ఎన్నికలు-జర్నలిజం విద్యార్థుల క్షేత్ర పరిశీలన

TRINETHRAM NEWS

కూకట్పల్లి డిసెంబర్ 25 (త్రినేత్రం న్యూస్): తెలంగాణ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ జర్నలిజం విద్యార్థినీ, విద్యార్థులు క్షేత్రస్థాయి పరిశీలనలో పాల్గొని నివేదికలను అధ్యాపకుల ముందు ప్రదర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా విద్యార్థులు వివిధ గ్రామాలను ఎంచుకున్నారు. ముప్పైకి పైగా గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల క్షేత్ర పరిశీలనలో భాగంగా ప్రధమ,ద్వితీయ సంవత్సరం చదువుతున్న జర్నలిజం విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎన్నిక, బలపలిచిన పార్టీల మద్దతు, అభ్యర్థుల బలాలు, బలహీనతలు. అభ్యర్థుల గెలుపోటములకు సహకరించిన వివిధ కారణాలు, ఏకగ్రీవమైన విధానం, ప్రచార తీరు,సరళి, ప్రచార సాధనాలు, ప్రలోభాలు హామీలు, ఓటర్ల తీరుతెన్నులతోపాటు వివిధ అంశాలను విద్యార్థులు పరిశీలించారు.అలాగే గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించిన విద్యార్థులు డిసెంబర్ 24న సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ, బాచుపల్లి లో క్షేత్ర పరిశీలన ద్వారా తాము నమోదు చేసిన అంశాలను అధ్యాపకులు ముందు ప్రదర్శించారు.

ప్రధమ సంవత్సరం విద్యార్థినీ విద్యార్థులను డాక్టర్ షేక్ హసీనా, ద్వితీయ సంవత్సరం విద్యార్థినీ విద్యార్థులను డాక్టర్ షేక్ షమీర్ ప్రాక్టికల్స్ ఇంచార్జ్ గోపాల్ పర్యవేక్షించారు. వివిధ గ్రామాల్లో క్షేత్ర ప్రదర్శనకు వెళ్ళిన విద్యార్థినీ, విద్యార్థులు ఉత్సాహంగా తమ నివేదికలను అధ్యాపకులు తోటి విద్యార్థినీ, విద్యార్థులు మధ్య ప్రదర్శించటం గొప్ప అనుభూతులు పంచిందని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయి పరిశీలన అనేక రకాల అనుభూతులను అనుభవాలను, మిగిల్చడంతో పాటు రిపోర్టును తయారు చేయడంలో క్లాస్ రూమ్ లో నేర్చుకున్న, కమ్యూనికేషన్ రిపోర్టింగ్ పాఠాలు విషయసేకరణకు తోడ్పడటంతో పాటు ఎడిటింగ్ పాఠాలు రిపోర్టు తయారు చేయడానికి ఉపయోగపడ్డాయని విద్యార్థినీ, విద్యార్థులు తెలియజేశారు.

జర్నలిజం క్లాస్ రూమ్ పాఠాలతో పాటు ఇటువంటి క్షేత్రస్థాయి పరిశీలనలు జర్నలిజం విద్యార్థినీ, విద్యార్థులకు నైపుణ్యాలను మెరుగుపరచడంతో పాటు నైపుణ్యం కలిగిన రిపోర్టర్లను,ఎడిటర్లను వెలుగులోకి తెస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి అవకాశాన్ని కలిగించిన యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య డాక్టర్ వెల్దండ నిత్యానందరావు, రిజిష్ట్రార్ ఆచార్య డాక్టర్ కోట్ల హనుమంతరావు, హెచ్ ఓ డి ఆచార్య డాక్టర్ పద్మప్రియలకు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ జర్నలిజం విభాగం విద్యార్థిని,విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Local body elections-Field observation by journalism students

You cannot copy content of this page

Scroll to Top