వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వహించిన పద్మశ్రీ Dr. D R కార్తికేయన్ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ సందర్శించారు: పద్మశ్రీ Dr. డి ఆర్ కార్తికేయన్ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో దర్యాప్తు బృందానికి నాయకత్వం వహించారు.
ప్రతిష్టాత్మక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్; జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో డైరెక్టర్ జనరల్ మరియు పారా మిలిటరీ దళమైన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సి ఆర్ పి ప్ డైరెక్టర్ జనరల్ వంటి సవాలుతో కూడిన పదవులను ఆయన నిర్వహించారు. ఆయన కర్ణాటక రాష్ట్ర నిఘా మరియు భద్రతా విభాగానికి చీఫ్‌గా కూడా పనిచేశారు.
కోటిపల్లి మండలం నాగ్సాన్ పల్లి గ్రామంలోని క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి విచ్చేసి డాక్టర్ న్యూటన్ కొండవీటి ఎం బి బి ఎస్,MD మరియు డాక్టర్. లక్ష్మీ న్యూటన్ ఎం బి బి ఎస్ గార్లతో ఎన్నో సంవత్సరాలుగా ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
సమాజ హితం కోసం ఇంత చక్కటి ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల యూనివర్సిటీ నిర్మించాలనే వారి సంకల్పాన్ని మనసారా అభినందించారు. వారికి అన్ని విధాలుగా సహకరించడానికి తాను ఎప్పుడూ ముందుటాను అని.. ఈ అద్భుతమైన యూనివర్శిటీ నిర్మాణం కోసం అందరూ సహకరించాల్సిన ఆవశ్యకత గురించి చాలా విపులంగా మాట్లాడారు.
ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన వారికి సపోర్ట్ చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో బుద్ధ సి ఈ ఓ పౌండేషన్ వ్యవస్థాపకులు పులమరశెట్టి. చంద్రశేఖర్ మరియు వాణి దంపతులు, థాయిలాండ్ నుండి విచ్చేసిన క్వాంటమ్ సైంటిస్ట్ దంపతులు,
మేనేజింగ్ ట్రస్టీ పొట్లూరి. రాజశేఖర్ మరియు ఫౌండింగ్ ట్రస్టీ పొట్లూరి. శ్రీదేవి పాల్గొన్నారు.
ధ్యానం, అహింస మరియు ఆధ్యాత్మిక శాస్త్రంల ఆవశ్యకత గురించి, రోజూ వారి జీవన విధానంలో వాటిని అలవాటుగా చేసుకుంటే ఆరోగ్యం, ఆనందం మరి ఆదర్శమవంతమైన సమాజ నిర్మాణం సాధ్యం అని వ్యవస్థాపకులు తెలియజేశారు.
ఈ సందర్భంగా పద్మశ్రీ Dr. డి ఆర్ కార్తికేయన్ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ గోశాల సందర్శించి, తాను దేశమంతటా పర్యటించానని కానీ ఇక్కడ ఉన్న గోమాతల వసతి సదుపాయాలకు ఎక్కడ చూడలేదని వాటిని చాలా ప్రేమగా అద్భుతమైన సదుపాయాలతో చూసుకుంటున్న టీమ్ ను ఎంతగానో ప్రశంసించారు.. పిరమిడ్ లో ధ్యానం చేసి మధ్యాహ్నం భోజనానంతరం హైదరాబాద్ వెళ్ళారని ప్రజా సంబంధాల అధికారి సంఘ మైత్రేయులు పవన్ కుమార్ గారు పత్రికా ప్రకటనలో తెలియజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


