వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ గండీడ్ మండలం ఆశిరెడ్డి పల్లి గ్రామ బిఆర్ఎస్ సర్పంచ్ సుశీల రామచంద్రయ్య గండీడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి టి రామ్ మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వారితో పాటు 30 మంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్,ఉప సర్పంచ్‌లను అభినందిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమం దిశగా సమిష్టిగా పనిచేయాలని సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


