మాజీ శాసనసభ్యులు : రవీంద్ర కుమార్.
దేవరకొండ డివిజన్ డిసెంబర్ 18 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలం పోలేపల్లి గ్రామ సర్పంచ్ గా విజయం సాధించిన నోముల శ్రీను ని, మానవత్ తండా సర్పంచ్ గా విజయం సాధించిన రమావత్ శ్రీకాంత్ ,కొండమల్లేపల్లి మండలం చింతకుంట్ల,కొత్తబావి, గౌరికుంట తండా గ్రామాల సర్పంచూలుగా విజయం సాధించిన కావాటి వెంకటేష్ , జబ్బు జంగమ్మయాదయ్య , రమావత్ దిప్ల నాయక్ ని,ధైర్యపురి తండా సర్పంచ్ గా విజయం సాధించిన రమావత్అనితనీఅభినందించి, శాలువాలతో దేవరకొండమాజీశాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ సత్కరించారు.
ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన ప్రతి ప్రజాప్రతినిధి గ్రామాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని అంకితభావంతో పనిచేయాలి అని రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన సర్పంచులను ఆయన సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……గ్రామస్థాయి నుంచే బీఆర్ఎస్‌పై ప్రజలు చూపిన అపారమైన విశ్వాసం ఈ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా ప్రతిబింబించింది
ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలను నిరాశపరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


