Perwala Rajitha : పేర్వాల రజిత జంగారెడ్డి ఘనవిజయం

TRINETHRAM NEWS

డిండి. మండలం వావిల్ కోల్ లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం.

డిండి (గుండ్లపల్లి) డిసెంబర్ 17 త్రినేత్రం న్యూస్. డిండి మండలం వావిల్ కోల్ గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పేర్వాల రజిత జంగారెడ్డి భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.

ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోనే అభివృద్ధి లో నెంబర్ వన్ మోడల్ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతాననీ,తన సంకల్పంతో వావిల్ కోల్, వడ్డెర గూడెం, రుద్రాయగూడెం గ్రామ ప్రజలు ఎంతో నమ్మకంతో అభివృద్ధికిఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఓర్సు ముత్యాలు, ఓర్సు అంజయ్య (మాజీ ఎంపీటీసి) రామ్ రెడ్డి, రామ్మోహన్ రావు, సోకయ్య దశరథం, లింగము మల్పాల్ రెడ్డి, వెంకటయ్య. సత్తిరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, దామోదర రెడ్డి, సురేష్, సుధాకర్ రావు, సోకయ్య, మోహన్ రెడ్డి, యాదవ రెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Perwala Rajitha and Jangareddy

You cannot copy content of this page

Scroll to Top