పొగమంచు కారణంగా బస్సులు ఢీకొని మంటలు, 4 మంది మృతి
Trinethram News : ఢిల్లీ–ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కారణంగా ఒకదానికొకటి ఢీకొన్న నాలుగు బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
బస్సులతో పాటు సమీపంలో ఉన్న కొన్ని ఇతర వాహనాలు కూడా మంటల్లో చిక్కుకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.
ప్రమాదం కారణంగా ఢిల్లీ–ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించడంతో పాటు ప్రమాద కారణాలపై విచారణ చేపట్టారు. దట్టమైన పొగమంచులో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


