వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో.ఈ నెల 17వ తేదీన పోలింగ్ సందర్బంగా. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు.పోలింగ్ ముగింపు సమయం మధ్యాహ్నం 1:00 గంటల వరకు – నిశ్శబ్ద కాలం సైలెన్స్ పీరియడ్ అమలు అవుతుందని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ప్రతీక్ జైన్ సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో మూడవ విడత,పరిగి మండలం, కుల్క చెర్ల, పూడూర్, చౌడాపూర్, దోమ మండలా ల లో జరిగే ఎన్నికల సందర్బంగా… ఈ నెల 17 వ తేదీన పోలింగ్ జరగనున్న ప్రాంతాలలో, పోలింగ్ ముగింపు సమయానికి 44 గంటల ముందు నుండి నిశ్శబ్ద కాలం సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
15 వ తేదీన సాయంత్రం 5:00 గంటల నుండి 17.12.2025 మధ్యాహ్నం 1:00 గంటల వరకు.కౌంటింగ్ ముగిసే వరకు నూట నలాబై సెక్షన్ అమలు లో ఉంటుందని తెలిపారు. సంబంధిత పోలింగ్ ప్రాంతాలలో కింది తెలిపిన కార్యక్రమాలు పూర్తిగా నిషేధించిన్నట్లు తెలిపారు ఎటువంటి బహిరంగ సమావేశాలు, సభలు, ఊరేగింపులు నిర్వహించరాదన్నారు. సినిమా, టెలివిజన్, సోషల్ మీడియా లేదా ఇతర మాధ్యమాల ద్వారా,సంగీత, నాటక, వినోద కార్యక్రమాల ద్వారా ఎన్నికల ప్రచారం చేయరాదన్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018 – సెక్షన్ 214 2 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


