CITU : సిఐటియు అఖిలభారత 18వ మహాసభలను జయప్రదం చేయండి!

TRINETHRAM NEWS

జనవరి 4న “చలో విశాఖ” గోడ పోస్టర్లు ఆవిష్కరణ

త్రినేత్రం న్యూస్: డిసెంబర్ 15: తిరుపతి జిల్లా :రేణిగుంట .. రేణిగుంట: సిఐటియు అఖిలభారత 18వ మహాసభలు 2025 డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరిగే కార్మిక మహాసభలను జయప్రదం కావాలని ఆకాంక్షిస్తూ, రేణిగుంట బుగ్గ వీధిలోని అంగన్వాడి సెంటర్ వద్ద సిఐటియు జెండా ఆవిష్కరణ అంగన్వాడి ప్రాజెక్టు అధ్యక్షురాలు ధనమ్మ నాయకత్వంలో బాలబడి పిల్లలు, సిఐటియు నాయకులు కలిసి ఎగరవేశారు. అనంతరం జనవరి 4న విశాఖపట్నంలో జరిగే బహిరంగ సభకు పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ఆటో, లారీ, హమాలి, రైల్వే,బిల్డింగ్ రంగం, పారిశుద్ధ్యం కార్మికులు మొదలైన కార్మికులందరూ రేణిగుంట మండలం నుండి కదలి రావాలని ,చలో విశాఖ గోడ పోస్టర్లను సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొండ్రెడ్డి హరినాథ్ ఆధ్వర్యంలో విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ రేణిగుంట ప్రాజెక్టు అధ్యక్షురాలు ధనమ్మ, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొండ్రెడ్డి హరినాథ్, సీనియర్ కామ్రేడ్ వెంకటరమణ, శ్రామిక మహిళా నాయకురాలు ఈశ్వరమ్మ, మహాలక్ష్మమ్మ, సులోచన, పద్మమ్మ, ఆర్టీసీ రిటైర్డ్ మునిస్వామి తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Make the 18th CITU All India Conference a success!

You cannot copy content of this page

Scroll to Top