త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 13.. అనపర్తి, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం ఇవాళ ప్రారంభమైన రాజమహేంద్రవరం డివిజన్ స్థాయి ఉపాధ్యాయుల ఆటల పోటీలు అనపర్తి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొవ్వూరి శ్రీనివాసరెడ్డి (దత్తుడు శ్రీను ) పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ మల్లిడి పార్వతి, మరియు కూటమి సభ్యులు ప్రారంభించారు, ఈ కార్యక్రమం లో అనపర్తి ఎమ్ ఈ వో సత్తిరెడ్డి, పాఠశాల హెచ్ఎం,పులగం వెంకటరెడ్డి , గేజెటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘ అధ్యక్షులు కె. వి రమణారావు గారు, ఇల్లపల్లి హెచ్ఎం, పప్పు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇవాళ జరిగిన క్రికెట్ మ్యాచ్ లలో, మొదటి మ్యాచ్ లో రాజమండ్రి అర్బన్ మండలం అనపర్తి మండలం పై విజయం సాధించింది.
2వ మ్యాచ్ లో రాజమండ్రి రూరల్ మండలం సీతానగరం మండలం పై విజయం సాధించింది … 3వ మ్యాచ్ లో రంగంపేట మండలం బిక్కవోలు మండలం పై విజయం సాధించింది, మహిళా ఉపాధ్యాయినుల త్రోబాల్ పోటీలలో రంగంపేట ప్రధమ స్థానం, కోరుకొండ మండలం ద్వితీయ స్థానం, సాదించాయి. మరో రెండురోజులపాటు పోటీలు కొనసాగుతాయని డివిజన్ కోఆర్డినేటర్ పడాల శ్రీనివాసరెడ్డి, తెలియజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


