ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ను కలిసిన ఆటో యూనియన్ నాయకులు.
ఏఐటీయూసీ అనుబంధ క్రాంతి ఆటో యూనియన్ ఐడీపీఎల్ నుండి గండిమైసమ్మ చౌరస్తా కు నడిపే ఆటో డ్రైవర్లు కొత్తగా ఎన్నికైన అధ్యక్ష,కార్యదర్శి రాజకుమార్,ఎల్లస్వామి ఆధ్వర్యంలో సిఐ ని కలసి శాలువతో సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథులుగా సీపీఐ కార్యదర్శి ఉమా మహేష్, ఏఐటీయూసీ అధ్యక్ష,కార్యదర్శి హరినాథ్,శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ డ్రైవర్లు కచ్చితంగా లైసెన్స్ కలిగిఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో పైలటింగ్ ఉండకూడదని దాన్ని వల్ల అమాయకులు ఈ రెండు రోజుల్లో ఇద్దరు మరణించారని కావున నిబంధనలు పాటించాలని సూచించారు.
అలాగే ప్రయాణికులతో మంచిగా మెలగాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి రాము, ప్రజానాట్యమండలి అధ్యక్షుడు ప్రవీణ్ ,సీనియర్ నాయకులు కేశవులు,ఆటో యూనియన్ నాయకులు జహంగీర్, కుమార్,గోపి,శ్రీనివాస్,పూర్ణ చందర్,బాలచందర్ తదితరులు పాల్గొన్నారు.