డిండి, (గుండ్ల పల్లి )డిసెంబర్ 09, త్రినేత్రం న్యూస్. గ్రామ పంచాయితీ ఎన్నికలలో భాగంగా డిండి క్లస్టర్లో మూడు గ్రామపంచాయతీలో గాను డిండి గ్రామపంచాయతీలో సర్పంచ్ అభ్యర్థులుగా గిర మోని శ్రీను నల్లగంతుల రవి వావిళ్ళ సలయ్య ముగ్గురు పోటీలో నిలిచారు. 14 వార్డులో గాను సుమారు 40 మంది పోటీలో ఉన్నారు. గోనకల్ గ్రామపంచాయతీలో సర్పంచ్ పోటీకి కొసిరెడ్డి రాజేందర్ రెడ్డి, శ్రీపతి శ్రీనివాసరెడ్డి ఇద్దరు అభ్యర్థులుండగా, 8 వార్డులకు గాను అభ్యర్థులు పోటీలో నిలిచారు. జెత్య తండా గ్రామపంచాయతీలో సర్పంచులుగా సభావట్ రాములు, రామావత్ కిషన్ బరిలో ఉండగా, ఆరు వార్డుల్లో ఏకగ్రీవయ్యామని, రెండు వార్డుల్లో మాత్రమే పోటీ ఉన్నదని డిండి క్లస్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ వై కృష్ణయ్య తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


