“Christmas Celebrations” :అపురూప కాలనీలో ఘనంగా “క్రిస్మస్ సెలబ్రేషన్స్” వేడుకలు

TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు 130 – సుభాష్ నగర్ డివిజన్ అపురూప కాలనీలోని మెస్సియా గాస్పెల్ చర్చ్ నందు పాస్టర్స్, క్రిస్టియన్స్, మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ సెలబ్రేషన్స్ కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ ప్రేమ, శాంతి, సామరస్యాలకు ప్రతీక క్రిస్మస్ వేడుకలు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో ఆపరేటివ్ చైర్మన్ మన్నె రాజు, డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ, ఏవీ శేషా చారి, అపురూప కాలనీ సెక్రటరీ రమణ, మాజీ అధ్యక్షులు గణేషన్, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, రెవ. ఏఎస్. పాల్ , రేవ డా. కె. డానియల్ సాల్మన్, రేవ.టి. శాంతయ్య తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

"Christmas Celebrations" celebrated in Apurupa Colony

You cannot copy content of this page

Scroll to Top