సాటిలైట్ సిటీ గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల…
త్రినేత్రం న్యూస్ : అర్హులైన పేదలందరికీ పెన్షన్ అందించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు ఉదయం సాటిలైట్ సిటీ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాలలో ఒకటైన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని, అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ని పెంచి ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదని అన్నారు.
ప్రతి పేదవాడికి న్యాయం చేకూరే విధంగా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని, రాష్ట్రంలో 65 లక్షల మందికి 13 రకాల పెన్షన్లు అందిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించి ప్రభుత్వం ముందుకెళుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళుతుందని రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ఒకటవ తారీఖు సాయంత్రానికి అందరికీ పెన్షన్ ఇంటింటికి వెళ్లి అందజేయడం జరుగుతుందని, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనివిధంగా ఇంత పెద్ద మొత్తంలో ఇన్ని లక్షల మందికి పెన్షన్లు అందించే ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి సారధ్యంలో కూటమి ప్రభుత్వానిదని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ యామన నారాయణ గౌడ్, కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పండురి అప్పారావు, నిచ్చెనకోళ్ల సత్తిబాబు, దారా అన్నవరం, ఎమ్మెస్సార్ శ్రీను, బైరెత్తి సరోజినీ దేవి, పెంకె కోటేశ్వరరావు, ఎర్ర రాంబాబు, చౌడాడ లాజర్, గెద్దాడ కృష్ణ, జి.నాగేంద్ర, చౌడాడ సునీల్, వెలుగుబండి దుర్గారావు, ప్రసాద్ బాబు, మన్యం శ్రీను, మజ్జి సాయి కిరణ్, ఎంపీడీవో సునీల్ ఆర్మీ స్ట్రాంగ్, పంచాయతీ కార్యదర్శి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


