వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. సమాజాన్ని సక్రమ మార్గంలో నడపడంలో స్త్రీ పాత్ర ప్రధానమైనదని వికారాబాద్ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. ఈరోజు శిశు మందిర్ పూర్వ విద్యార్థిని శ్రీమతి శారదా దయానిధి ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలోని శిశుమందిర్ పాఠశాలలో నిర్వహించిన సప్త శక్తి సంగం.. మహిళా మాతృమూర్తుల సమ్మేళనం కార్యక్రమానికి చిగుళ్లపల్లి మంజుల రమేష్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంజుల రమేష్ గారు మాట్లాడుతూ. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి రూపం స్త్రీ అన్నారు. అలాంటి స్త్రీ సమాజంలో కీర్తి మంతురాలుగా జీవించాలి అన్నారు. ఒక కుటుంబంలో సిరి సంపదలు ఉండాలంటే స్త్రీ చేతిలోనే ఉంటుంది అన్నారు. నేడు మహిళలు అన్ని రంగాలలో రాణిస్తూ భారతదేశ కీర్తిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడం జరుగుతుందని అన్నారు.
ఈమధ్య పాకిస్తాన్ తో జరిగిన యుద్ధం సందర్భంగా ఆపరేషన్ సింధూర్ లో కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే సమాజాన్ని సన్మార్గంలో నడిపే శక్తి ఒక స్త్రీకి మాత్రమే ఉంది అని మంజుల రమేష్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ శ్రీదేవి సదానంద్ రెడ్డి పాల్గొనగా, వక్తలుగా విశ్వ విందు పరిషత్ జిల్లా కార్యదర్శి శ్రీమతి శ్రీలతారెడ్డి , విశ్వవిందు పరిషత్ దుర్గా వాహిని ప్రముఖులు శ్రీమతి వాణి సక్కుబాయి పాల్గొని, స్త్రీ గొప్పతనం గురించి వివరించారు. ఈ కార్యక్రమాన్ని శిశు మందిర్ పూర్వ విద్యార్థిని ప్రసన్న నిర్వహించగా, శిశు మందిర్ పాఠశాల సహా ప్రధానచార్యులు సౌజన్య తో పాటు శిశు మందిర్ పూర్వ విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


