Trinethram News : ఈరోజు 132 – జీడిమెట్ల డివిజన్ పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు జర్నలిస్ట్ సంఘాల నాయకులు బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసి పలు జర్నలిస్టుల సమస్యలను విన్నవించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించడంతో పాటు ప్రెస్ క్లబ్ భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయిస్తానన్నారు. అదేవిధంగా ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. దొమ్మర పోచంపల్లి పరిధిలో ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించడం జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న సంబంధిత శాఖ మంత్రితో సైతం ఈ విషయం పై చర్చించి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు. సూరారం లో నిర్మించ తలపెట్టిన ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత తనదేనని, ఇప్పటికే కొంత శాతం నిర్మాణం జరిగిందని, మరో 10 లక్షలతో వచ్చే నెల మొదటి వారంలో పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. భవన నిర్మాణానికి అవసరమైతే మరో 20 లక్షలు తాను సొంతంగా ఇచ్చి పూర్తి చేస్తానని, అట్టి భవనానికి తన తండ్రి పేరు అయిన కూన మాణిక్యం పాండు జర్నలిస్ట్ భవన్ గా ఇక్కడి జర్నలిస్టులకు అందిస్తానని వివరించారు. స్థానికంగా ఉన్న కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో సైతం మాట్లాడి జర్నలిస్టులకు వైద్య సహాయం అందే దిశగా తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యుజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్,టి డబ్ల్యూ జె ఎఫ్ రాష్ట్ర నాయకులు తన్నీరు శ్రీనివాస్ ,టి ఎస్ యూ డబ్ల్యూ జె నాయకులు గుంటూరు శేఖర్, కసుకుర్తి వెంకట్, టి యు డబ్ల్యూ జె నాయకులు రంగు వెంకటేష్ గౌడ్, కొలిపాక వెంకట్, ఉద్దండపురం వెంకటేష్ గౌడ్, శివాజీ, కుంట అనిల్ కుమార్,ఫెడరేషన్ నాయకులు దామెర జగదీశ్వర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


