ఎమ్మార్పీఎస్ చందంపేట మండల అధ్యక్షులు అందుగుల సైదులు మాదిగ.
దేవరకొండ డివిజన్ నవంబర్ 26 త్రినేత్రం న్యూస్. నవంబర్ 26 డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శమని చందంపేట మండల అధ్యక్షులు అందుగుల సైదులు అన్నారు.బుధవారం భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 76సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేవరకొండలో బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అందుగుల సైదులు మాట్లాడుతూ.. దేశంలోని సబ్బండ వర్గాల ప్రజలకు స్వేచ్ఛ,స్వాతంత్య్రం, హక్కులను కల్పించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ అని కొనియాడారు. రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు ప్రతీ ఒక్కరు ఉద్యమించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు కొమ్ము ఉదయ్ కుమార్ చాట్ల ప్రశాంత్ కుక్కల మల్లయ్య ఎలిమినేటి ఈశ్వర్ దర్శనం శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


