TRP రాష్ట్ర యువ నాయకులు బొడ్డుపల్లి చంద్రశేఖర్ ఆగ్రహం
Trinethram News : తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ రిజర్వేషన్లను ప్రకటిస్తూ మొత్తం 12,375 గ్రామాల్లో బీసీలకు కేటాయించిందేమిటి… కేవలం 2,176 పంచాయతీలు మాత్రమే! ఇది రిజర్వేషన్ కాదు — బీసీలపై బహిరంగ దాడి! బీసీ సమాజాన్ని నట్టేట ముంచే రాజకీయ యజ్ఞం! అని TRP రాష్ట్ర యువ నాయకులు బొడ్డుపల్లి చంద్రశేఖర్ మండిపడ్డారు.
“42% ఇస్తానని హామీ ఇచ్చి 17% మాత్రమే ఇచ్చే ప్రభుత్వం… ఇది పాలన కాదు — బీసీల భవిష్యత్తుపై పాతుకుపోయిన కత్తి! బీసీ ఓట్లతో గెలిచి బీసీలకే ద్రోహం చేసిన ప్రభుత్వం ఇదే!” అని ఆయన ఘాటుగా విమర్శించారు.
కామారెడ్డి డిక్లరేషన్ అంటూ బీసీలను నమ్మబలుకుతూ పెద్ద పెద్ద మాటలు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , అధికారంలోకి వచ్చిన వెంటనే రిజర్వేషన్ల కత్తిరింపుతో తమ అసలు రెడ్డి రాజకీయ కుట్రలను బయటపెట్టారని చంద్రశేఖర్ ఆరోపించారు.
ఇప్పటికే శాసనమండలిలో “ఈ 42% రిజర్వేషన్ అన్నది రెడ్ల పెద్ద డ్రామా – బీసీలను మోసం చేసే కుట్ర!”
అని చెప్తూ నిజాలను దేశం ముందుంచిన గౌరవనీయులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాటలు నేటి నిర్ణయంతో నిజమని రుజువైంది అని ఆయన గుర్తుచేశారు.
“బీసీలను అణగదొక్కే ఈ రెడ్డి సర్కార్‌కు పాఠం చెబితే… అది ఇప్పుడు మాత్రమే. ప్రతి బీసీ లేచి నిలబడాలి. బీసీ హక్కుల మీద కత్తి దించితే… మేము కత్తి తీసి పోరాడతాం!” అని చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చివరిగా బీసీ సమాజానికి ఆయన గర్జన: “బీసీల హక్కులను దోచుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి… ప్రతి ఊరిలో, ప్రతి బస్టాండ్‌లో, ప్రతి ఇంటి ముందూ బీసీలు సమాధానం చెప్పాలి! బీసీలు ఐక్యమైతే – ఈ ద్రోహ ప్రభుత్వం ఒక్క రోజూ నిలబడదు!”
అగ్రకులాల రాజకీయ పార్టీలను బొంద పెట్టాలి అని TRP రాష్ట్ర యువ నాయకులు బొడ్డుపల్లి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


