TRINETHRAM NEWS

తిరుమల…

డిసెంబరు 19న శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు

డిసెంబరు 18న సిఫార్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వు

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23 నుండి 2024 జనవరి 2వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార దర్శనాన్ని పురస్కరించుకుని డిసెంబరు 19వ తేదీన మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సంద‌ర్భంగా డిసెంబరు 19న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

ఈ కారణంగా డిసెంబరు 18న సోమవారం సిఫారసు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరడమైనది.