Free Medical Camp : వైష్ణవి లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

TRINETHRAM NEWS

కూకట్పల్లి నవంబర్ 22 (త్రినేత్రం న్యూస్) : జగద్గిరిగుట్టలోని వైష్ణవి టెక్నా పాఠశాలలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. లైయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ నార్త్, మల్లారెడ్డి ఆసుపత్రి లు సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. లైయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ నార్త్ అధ్యక్షులు లయన్ బిర్రు ఆంజనేయులు, జోనల్ సభ్యులు లయన్ పాషాలు ముఖ్యఅతిథిలు గా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. జనరల్, గుండె, కంటి, దంత, మహిళ తదితర విభాగాలలో వైద్య పరీక్షలు చేశారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులకు వివిధ పరీక్షల నిర్వహించి అవసరమైన వారికి మందులను అందజేశారు.

ఈ సందర్భంగా లైయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ నార్త్ అధ్యక్షులు లయన్ బిర్రు ఆంజనేయులు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలలో లైయన్స్ క్లబ్ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. వైష్ణవి పాఠశాల యాజమాన్యం ముందుకు వచ్చి వైద్య శిబిరాన్ని పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలతో పాటు, పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత, ఆస్పత్రుల వద్ద నిరంతరాయంగా టిఫిన్ ఏర్పాటు లాంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైష్ణవి పాఠశాల చైర్మన్ సిహెచ్ నరసింహులు గౌడ్, డైరెక్టర్ జి. బాలరాజు, పాఠశాల ప్రిన్సిపాల్ సాయిబాబా, లయన్స్ క్లబ్ ప్రతినిధులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Free medical camp organized by Lions Club

You cannot copy content of this page

Scroll to Top