శాంతి భద్రతలే తొలి ప్రాధాన్యం, మహిళా భద్రతకు ప్రత్యేక చర్యలు

TRINETHRAM NEWS

జిల్లా నూతన ఎస్పీగా స్నేహ మెహ్రా,ఐపియ‌ఎస్ .
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా సమర్థవంతంగా విధులు నిర్వహించిన శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్ ఈ రోజు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలను స్వీకరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆమెకు సీనియర్ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం చార్జ్ తీసుకున్న సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలోని శాంతి భద్రతల పరిస్థితులను, గత చరిత్రను క్షుణ్ణంగా పరిశీలిస్తామని, అందుకు అనుగుణంగానే పోలీసు విధానాలలో (పోలిసింగ్ లో) అవసరమైన మార్పులు తీసుకురావడం జరుగుతుందని తెలియజేశారు.

నేర నియంత్రణ (క్రైమ్ కంట్రోల్) తన ప్రధాన లక్ష్యమని, జిల్లాలో నేరాల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థానిక సమస్యలను తెలుసుకుని, వాటి నివారణకు తగిన చర్యలు తీసుకుంటామని, తద్వారా ప్రజలు మరింత ప్రశాంతంగా, భద్రతగా ఉండే వాతావరణాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, మరియు ఇటీవల పెరుగుతున్న సైబర్ నేరాల గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అంతేకాకుండా, మహిళలు, పిల్లల భద్రతకు, రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని, సిబ్బంది సంక్షేమానికి కూడా తగిన చర్యలు తీసుకుంటూ, జిల్లా పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేస్తానని స్నేహ మెహ్రా తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

special measures for women's safety

You cannot copy content of this page

Scroll to Top