Solve Public Problems : గ్రామ మరియు మండల స్థాయిలో ప్రజా సమస్యలు పరిష్కరించండి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. చిత్తూరు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి పెనుమూరు ఎంపీడీవో ఆఫీస్ లో ప్రజా సమస్యల పరిష్కారం గురించి అన్ని శాఖల మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల ను సకాలంలో పరిష్కరించాలని మండల స్థాయిలో గ్రామస్థాయిలోని ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అలసత్వం చూపుతున్నందువల్ల ప్రజలందరూ జిల్లా స్థాయికి వస్తున్నారన్నారు. కావున గ్రామ మరియు మండల స్థాయి అధికారులు ఎక్కడికక్కడ పరిష్కారం చేసినట్లయితే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు.

అలాగే ప్రభుత్వం చేపడుతున్న వివిధ రకాల అభివృద్ధి పథకాల గురించి వివిధ శాఖలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైనా గ్రామ మండల స్థాయిలో నిధుల కొరత ఉన్నట్లయితే జిల్లా పరిషత్ కి తెలియపరిస్తే నిధులు మంజూరు చేయిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నీలకంఠేశ్వర్ రెడ్డి మరియు మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Solve public problems at village

You cannot copy content of this page

Scroll to Top