Vegetable Prices : తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన కూరగాయల ధరలు?

TRINETHRAM NEWS

Trinethram News : నవంబర్ 13 . తెలుగు రాష్ట్రాల్లో కూర గాయల ధరలు ప్రస్తుతం ఆకాశాన్ని చూస్తున్నాయి… కూరగాయల ధరలు పెరగడంతో మధ్యతరగతి పై ప్రభావం పడుతుంది,పలు రకాల కూరగాయలు కిలో రూ”100కు చేరాయి,ఓవైపు మొంథా తుఫాన్ మరోవైపు కార్తీకమాసం నేపథ్యంలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

దీంతో వినియోగదారులను తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.సాధారణంగా సీజన్ మారినప్పుడు కొంతమేర ధరల్లో మార్పులు ఉంటాయి కానీ,ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. హైదరాబాద్,విజయవాడ,విశాఖ, గుంటూరు,వరంగల్,వంటి నగరాల్లోనే కాకుండా గ్రామీణ మార్కెట్ల లో కూడా కూరగాయల ధరలు మండుతున్నాయి.చాలా రకాల కూరగాయలు పావుకేజీకి రూ.30–35 కంటే తక్కువకు దొరకడం లేదు,అంటే కిలోకు రూ.100–120 వరకు పలుకుతున్నాయి.ముఖ్యంగా చిక్కుడు పూల గోబి,క్యారెట్, టమాటో దోసకాయ,బీరకాయ, మిరపకాయ,వంకాయ వంటి సాధారణ కూరగాయలు కూడా మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షలా మారాయి.ఇటీవల మొంథా తుఫాను కారణంగా పలు జిల్లాల్లో కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.వరద నీరు నిలిచిపోవడం తో పంటలు కుళ్లిపోవడం,రవాణా అంతరాయం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vegetable prices increased in Telugu states?

You cannot copy content of this page

Scroll to Top