పల్నాడు జిల్లా :నవంబర్ 10. ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద సోమవారం ఉదయం మరో బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బాపట్ల వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి ఒరిగిపోయింది.
రోడ్డు విస్తరణ పనులకు ఏర్పాటు చేసిన పైపులను తగిలి బస్సు ఆగిపోయింది. దీంతో అప్రమత్తమైన 30 మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాల నుంచి బయటకు దూకేశారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


