MLA KP Vivekanand : సంక్షేమ సంఘాలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు 125 – గాజుల రామారం డివిజన్ ఎన్టీఆర్ నగర్ – ఏ నూతన సంక్షేమ సంఘం సభ్యులు చింతల్ లో బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యే ని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ నగర్ నూతన సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్యే శాలువతో సత్కరించారు.

అనంతరం వారు మాట్లాడుతూ… సంక్షేమ సంఘాలు ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. అభివృద్ధి అనేది నిత్యం జరిగే ప్రక్రియని కాలనీలో ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించడంలో నూతన సంక్షేమ సంఘానికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, తెలంగాణ సాయి, చందు ముదిరాజ్, నూతన అధ్యక్షులు చంద్ర గౌడ్, ప్రధాన కార్యదర్శి రజాక్, ఉపాధ్యక్షులు వీరేష్ గౌడ్, అజ్మత్, కోశాధికారి శ్రీనివాస్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, సభ్యులు శ్రీనివాస్ గౌడ్, రాజలింగం గౌడ్, ఆంజనేయులు, కిషోర్, మోయిన్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Welfare associations should be partners in development

You cannot copy content of this page

Scroll to Top