National Highway Cut : జాతీయ రహదారి( ఎన్ హెచ్ 765) కోత

TRINETHRAM NEWS

హైద్రాబాద్ – శ్రీశైలం రాకపోకలు బంద్.
డిండి(గుండ్ల పల్లి) అక్టోబర్ 29 త్రినేత్రం న్యూస్. తుఫాన్ కారణంగా భారీ వరద లతో డిండి ప్రాజెక్టు అలుగు వద్ద నీరు బ్రిడ్జి పై నుండి ప్రవహించింది. దీని కారణంగా బ్రిడ్జి పై రోడ్డు కోతకు గురైంది దీనితో హైదరాబాద్ -శ్రీశైలం జాతీయ రహదారి ఎన్ హెచ్ 765 పై రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు రోడ్డుపై నుండి వాహనాల రాకపోకలను బారికెడ్లను రోడ్డుకుఅడ్డంగా ఏర్పాటుచేసి వచ్చి పోయే వాహనాదారులను అప్రమత్తం చేశారు. దీనితో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని పోలీసు వారు వాహనాదారులకు సూచించారు. దీనితో పలువురు వాహనాదారులు వెనుదిరిగి, తమ ప్రయాణాలను వాయిదా వేసుకుని వెళ్ళిపోయారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

National Highway (NH 765) cut.

You cannot copy content of this page

Scroll to Top