Rahman Foundation : ఆర్థిక సహాయంతో మానవత్వానికి ముద్ర వేసిన రెహమాన్ ఫౌండేషన్

TRINETHRAM NEWS

అపత్కాలంలో మిత్రుడి కుటుంబానికి ₹10,000 రూపాయలు ఆపన్న హస్తం అందించిన డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ

Trinethram News : ఉట్నూర్: ఉట్నూర్ మండల కేంద్రంలోని శాంతినగర్ గ్రామానికి చెందిన తన ఆప్త మిత్రుడు నాథరీ మల్లేష్ భార్య అనారోగ్యంతో ఉన్నారనే విషయం తెలుసుకున్న రెహమాన్ ఫౌండేషన్ ఫౌండర్ & చైర్మన్ డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ , సామాజిక సేవలో భాగంగా మిత్రుడు కుటుంబానికి భరోసాగా ఆసుపత్రి ఖర్చుల కోసం ₹10,000/- నగదు ఆర్థిక సహాయంను SSC Batch 2003–04 ద్వారా అందజేశారు. సామాజిక సేవ చేయడం తన కర్తవ్యమని, బాధలో ఉన్నవారికి తోడుగా ఉండడం తన ధర్మమని డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ పేర్కొన్నారు. సహాయం చేయడం కేవలం దాతృత్వం కాదు, అది మనిషి హృదయంలోని ప్రేమకు ప్రతిరూపమని ఆయన అన్నారు.

సమాజంలో సేవా భావం, మానవతా దృక్పథం విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న రెహమాన్ ఫౌండేషన్, ప్రతి అవసర సమయంలో ప్రజల పక్కన నిలుస్తూ మానవత్వానికి మారుపేరుగా ఉంటుందన్నారు. ఈ సందర్భంలో తన మిత్రుడి కుటుంబ సభ్యులు బాధ సమయంలో తమ కుటుంబానికి తోడుగా నిలిచిన రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవకులు జాటోత్ దవిత్ కుమార్, కొండేరి శ్రీనివాస్, రఘుపతి, సత్యనారాయణ, టి. ప్రతాప్, ఖలీం పాషా, అబ్దుల్ రజి తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rahman Foundation humanity with financial assistance

You cannot copy content of this page

Scroll to Top