త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంచార్జ్ మంత్రివర్యులు శ్రీమతి ధనసరి సీతక్క (అనసూయ) మరియు రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు తో కలిసి గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విస్తృతంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జారె ఆదినారాయణ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రజలకు మేలు చేసే విధానాలతోనే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి పక్షాన నిలిచి నవీన్ యాదవ్ ఘన విజయంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


