త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా నిర్వహించే పోలీస్ సంస్మరణ దినోత్సవాన్ని వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్.ప్రతీక్ జైన్, ఐఏఎస్ లు పాల్గొన్నారు.
ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఐఏఎస్ మాట్లాడుతూ, పోలీస్ అమరవీరుల బలిదానం దేశానికి గర్వకారణమని కొనియాడారు. “పోలీస్ శాఖ అందిస్తున్న సేవలు అత్యంత విలువైనవి. సమాజంలో భద్రత, శాంతిని కాపాడటంలో పోలీసులు నిరంతరం పోరాడుతున్నారు. దేశ సరిహద్దుల్లో 1959లో జరిగిన చైనా దళాల దాడిలో ప్రాణాలు కోల్పోయిన 10 మంది వీరుల స్మారకార్థం ఈ రోజును జరుపుకోవడం మనందరి బాధ్యత. వారి ధైర్యసాహసాలు, దేశభక్తి భావితరాలకు ఆదర్శం. జిల్లా పరిపాలనలో పోలీస్ వ్యవస్థ పాత్ర చాలా కీలకం. జిల్లా ప్రజల తరఫున అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నాము” అని పేర్కొన్నారు.
ఇట్టి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి, ఐపీఎస్ మాట్లాడుతూ, దేశ అంతర్గత భద్రతను కాపాడుతూ, చట్టాన్ని అమలు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వీర పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. “పోలీస్ ఉద్యోగం కేవలం విధి నిర్వహణ మాత్రమే కాదు, ప్రజలకు సేవ చేసే మహత్తర అవకాశం. శాంతిభద్రతల పరిరక్షణలో మన జవాన్లు చేసిన, చేస్తున్న కృషి వెలకట్టలేనిది. వారి నిస్వార్థ సేవ మరియు త్యాగాలు జిల్లా పోలీసులకు నిత్య స్ఫూర్తిగా నిలుస్తాయి” అని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో భాగంగా నేటి నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన “జాతీయ ఐక్యత దినోత్సవం” అక్టోబర్ 31వ (తేది:21-10-2023 నుండి 31-10-2023) వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి సంధార్బంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో లో విద్యార్థులకు, పోలీస్ అధికారులకు వ్యాసరచన పోటీలు, ఓపెన్ హౌస్ కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు, సైకిల్ ర్యాలీలు మొదలగు వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు పాల్గొని విజయ వంతం చెయ్యాలని జిల్లా ఎస్.పి . కే. నారాయణ రెడ్డి తెలియజేశారు.
పోలీస్ పరేడ్ అనంతరం, అమరవీరుల స్థూపం వద్ద జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఐఏఎస్, మరియు జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి, ఐపీఎస్ గారు, అడిషనల్ ఎస్పి బి.రాములు నాయక్ ,జిల్లా లోని పోలీస్ అధికారులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాయుధ దళాల గౌరవ వందనం మధ్య జిల్లా అడిషనల్ ఎస్పీ బి.రాములు నాయక్ అమరవీరుల పేర్లను చదివి వినిపించారు.
ఇట్టి కార్యక్రమం లో జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి ,అదనపు ఎస్పీ శ్రీ బి.రాములు నాయక్ ,వికారాబాద్ డిఎస్‌పి శ్రీనివాస్ రెడ్డి ,పరిగి డిఎస్‌పి శ్రీనివాస్ గారు,తాండూర్ డిఎస్‌పి శ్రీ బాల కృష్ణ రెడ్డి ,డిసిఆర్‌బి డిఎస్‌పి జానయ్య , డిటిసి డిఎస్‌పి శ్రీనివాసులు ,ఆర్ డిఎస్‌పి వీరేష్ ఇన్స్పెక్టర్,ఆర్‌ఐ లు,ఎస్‌ఐ లు,ఆర్‌ఎస్‌ఐ లు, సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


