Video Conference : పిల్లలను బయటకు పంపితే కఠిన చర్యలు

TRINETHRAM NEWS

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు

పెద్దపల్లి, అక్టోబర్ 14: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. బకాయిల కోసం తరగతి గదుల నుంచి పిల్లలను బయటకు పంపితే కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు మంగళవారం హైదరాబాద్ నుంచి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం పై రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ , ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పాల్గొన్నారు.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద ప్రైవేటు పాఠశాల యాజమాన్యులు వారి బడులలో చదివే విద్యార్థులను ఎటువంటి ఇబ్బందులకు గురి చేయడానికి వీలు లేదని అన్నారు.
విద్యార్థులకు సంబంధించిన ఫీజు ప్రభుత్వం చెల్లిస్తుందని, విద్యార్థుల తల్లిదండ్రులను ఫీజు కట్టమని అడగటం లేదా విద్యార్థులను బయటకు పంపడం వంటి వాటికి పాల్పడితే తీవ్రంగా పరిగణించి కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల నుంచి విద్యార్థులను బయటికి పంపడానికి వీలు లేదని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు వెంటనే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ యాజమాన్యులతో సమావేశమై పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులకు గురి చేయకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కు ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావాలని అన్నారు. సామాజిక బాధ్యతగా భావించి విద్యా రంగం పై ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుందని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు రావాల్సిన బకాయిలు ప్రభుత్వం క్రమ పద్ధతిలో విడుదల చేస్తుందని, బకాయిల కోసం విద్యార్థులను అవమానించినట్లు ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు తరగతి గదిలో నుంచి పిల్లలను బయటకు పంపిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ జాబితాను కలెక్టర్ల సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో జరుగుతున్న పాఠ్యాంశాల బోధన, అక్కడ ఉన్న వసతులను సైతం పరిశీలించి నివేదిక అందించాలని అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Strict action if children are sent out

You cannot copy content of this page

Scroll to Top