వేతన ఒప్పందం అనంతరం ఎన్నికలు నిర్వహించండి
కార్మిక శాఖ కమిషనర్ ను కలిసి కోరిన ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు.
Trinethram News : త్రినేత్రం న్యూస్, విజయవాడ, అక్టోబర్ 09: తూర్పు గోదావరి జిల్లా కడియం పేపర్ మిల్ లో నూతన వేతన ఒప్పందం వెంటనే చేయాలని ఒప్పందం తరువాత మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని ఏఐటీయూసీ ఉపాధ్యక్షులు తాటిపాక మధు కోరారు. గురువారం ఉదయం స్థానిక సీతారామపురం లో కార్మిక శాఖ కార్యాలయం లో కార్మిక శాఖ కమిషనర్ ఎం వి శేష గిరి బాబు ను జే ఏ సి యూనియన్ నాయకులు అప్పారావు, రాజబాబు, నాయుడు, పల్లి ప్రసాద్, బి శ్రీనువాస్, చిన్నారావు, బి రాజు రమణ రావు, ఏఐటీయూసీ జాతీయ సమితి సభ్యులు తోకల ప్రసాద్, తాతయ్య తదితరులు కలిసి వినతి పత్రం అందజేశారు.
అనంతరం యూనియన్ నాయకులు మాట్లాడుతూ, ప్రస్తుతం మా కడియం పేపర్ మిల్లు యాజమాన్యం తో వేతన ఒప్పందం చర్చలు, జరుగుతున్నాయని వేతన ఒప్పందం పూర్తయ్యేవరకు ఎన్నికలు వాయిదా వేయాలని ఒప్పందం ,జరిగిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కడియం పేపర్ మిల్, ఐక్యకార్యాచరణ కమిటీ కోరింది. కార్మికులకు మంచి వేతన ఒప్పందం చేయడమే లక్ష్యంగా, పనిచేస్తున్నామని ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


