తేదీ : 09/10/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం దగ్గరలో ఉన్నటువంటి పాలకొల్లు టిడ్కో ఇళ్ల వద్ద లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. వాళ్లకు బ్యాంకు అధికారులు నోటీసులు ఎందుకు ఇచ్చారో తెలియడం లేదు. శుక్రవారం లోపు రుణాలు చెల్లించాలని , చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, హెచ్చరించారు. దాంతో లబ్ధిదారులు ఆందోళనకు దిగడం జరిగింది. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన ఇళ్లకు బ్యాంకులకు సంబంధం ఏంటని లబ్ధిదారులు ప్రశ్నించారు. అద్దె చెల్లించలేక ప్రభుత్వ గృహాల్లో ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


