Collector Prateek : ఏటీసీలలో సాంకేతిక నైపుణ్యతతో కూడిన శిక్షణను అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు.

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి బుధవారం మర్పల్లి కేంద్రంలోని ఆధునాతన సాంకేతిక కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఏటీసీలో గల సౌకర్యాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఏటీసీలో శిక్షణ పొందుతున్న విద్యార్థినీ విద్యార్థులతో కావలసిన మౌలిక సదుపాయాలు, వివిధ సౌకర్యాలపై కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. శిక్షణ నిమిత్తం వచ్చిన విద్యార్థులకు ఆధునాతన సాంకేతికలో పట్టు సాధించే విధంగా విద్యార్థినీ విద్యార్థులను తీర్చిదిద్దాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఏటీసీలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ తెలిపారు. ఏటీసీలో ఫర్నిచర్ లేని పరిస్థితిని గ్రహించిన కలెక్టర్ విద్యార్థులకు సరిపోను కుర్చీలను సమకూరుస్తానని కలెక్టర్ తెలిపారు.
కలెక్టర్ సందర్శనలో భాగంగా ఏటిసి ఇంచార్జ్ మహేష్ , సూపరింటెండెంట్ భరత్ కుమార్ , డిప్యూటీ ట్రైనింగ్ ఆఫీసర్ జయప్రకాష్ , అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ సుధీర్ పటేల్ , జగదీష్.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Collector Prateek Jain has advised

You cannot copy content of this page

Scroll to Top